సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్మీ అధికారుల పేరుతో సెంటిమెంట్ వలకబోస్తూ అమాయకులను మోసం చేస్తున్న రాజస్తాన్ భరత్‌పూర్‌కు చెందిన సైబర్ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్లో పలు రకాలైన వస్తువులను అమ్మడం, కొనడం కోసం ప్రకటనలు ఇస్తుంటారు. అమ్మే వారు, కొనేవారితో మేం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నామంటూ నమ్మించి వివిధ రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న 12 మందిని ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా జైల్లో ఉన్న నిందితులను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు 10 కేసులతో సంబంధాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు.