జీడిమెట్ల, డిసెంబర్ 3 : కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి జయనగర్‌లోని శ్రీ సాయిత ప్యాలేస్‌లో నివాసం ఉంటున్న కె.మధుసూదన్‌రావు నవంబర్ 28న ఫ్లాట్‌కు తాళం వేసి కూతురు ఇంటికి వెళ్లి.. తిరిగి 29న ఉదయం రాగా ఇంట్లో చోరీ జరిగింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు సంపంగి లక్ష్మణ్, గుమ్మడి నాగశంకర్, గుమ్మడి మురళిలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ నర్సింహా, ఏసీపీ సురేశ్‌కుమార్, కూకట్పల్లి సీఐ ముత్తు, డీఐ వెంకటేశం, సీసీఎస్ బాలానగర్ ఇన్స్పెక్టర్ రాజు, కూకట్పల్లి ఎస్ఐలు సతీశ్‌రెడ్డి, గిరిశ్, తదితరులు ఉన్నారు.