సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన 16ఏండ్ల బాలుడికి మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్సను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం మీడియా సమావేశంలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోజ్ అగర్వాల్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అమోల్గుప్తా మాట్లాడుతూ 2007లో పుట్టుకతోనే గుండెలోని రెండు దిగువ గదుల మధ్య పెద్ద రంద్రం, ఊపిరితిత్తులకు ప్రవహించే మార్గాన్ని అడ్డుకోవడంతో.. టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్ను సరిచేయడానికి శస్త్రచికిత్స చేశారు.
ఎకో, కార్డియాక్ ఎంఆర్ఐలతో చేసిన దానిలో కుడి జఠరిక (ఆర్వీ) పనితీరు సరిగా లేదని వెల్లడైంది. ఊపిరితిత్తుల కవాటం నుంచి ఆర్వీలోకి లీకేజ్‌తో గుండె కుడివైపున వ్యాకోచం కలిగిస్తుంది. 16 ఏండ్ల వయస్సులో రోగం ఎక్కువైందని, ఈనెల 2న అపోలోలో చేరగా ఇన్వాసివ్ ప్రక్రియతో చికిత్సను విజయవంతంగా చేసినట్లు వెల్లడించారు.