మణికొండ, ఏప్రిల్ 20: హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నార్సింగి గ్రామానికి చెందిన జల్లి అన్విక ముదిరాజ్ సత్తాచాటింది. మణికొండలో ఆదివారం నిర్వహించిన తొమ్మిదో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
గతంలో పుణేలో జరిగిన జాతీయ స్థాయి చిన్నారుల కరాటే పోటీల్లో అన్విక స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నేకనాంపూర్ భాష్యం స్కూల్ తరఫున అన్విక కుంతీ కరాటే పోటీల్లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలు సాధించింది. తాజాగా డిస్ట్రిక్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లోనూ విజేతగా నిలవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచి అన్విక కరాటేలో ఉత్తమ ఫలితాలను సాధిస్తుందని, భవిష్యత్తులోనూ ఇదే విభాగంలో ఉత్తమ శిక్షణను అందించి జాతీయ స్థాయి పోటీలలో తలపడేలా తీర్చిదిద్దేనుకు కృషి చేస్తామని తండ్రి రాజీవ్ తెలిపారు.