హిమాయత్‌నగర్ : కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై(Anti-farmer policies) ఉద్య మించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు (MLA Koonamneni Sambashiva rao ) అన్నారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని తేరాపంత్ భవన్లో రైతు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం (BJP Government) కార్పొరేట్ రంగానికి ఊడిగం చేస్తుందని ఆరోపించారు. వారి లబ్దికోసమే చట్టాలను సైతం మార్పులు చేస్తుందని విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Budget) లో వ్యవసాయ అభివృద్ధికి ఎక్కువ శాతం నిధులు కేటాయింపు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో పొగై ఉందని, పేదరికం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యమని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు బలమైన పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు సహాయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనే అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపూరి బ్రహ్మం, కంజర భూమయ్య, విఎస్ ప్రసాద్ శాస్త్రీ, సూర్యనారాయణ, రమేష్,ప్రభులింగం,రాజిరెడ్డి,శంకరయ్య,కంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.