మూసాపేట, జూలై 24: కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆడేపు విజయ్‌కుమార్(35) తన భార్య ప్రసన్నతో కలసి కూకట్పల్లి పరిధి ఇంద్రహిల్స్ సాయి చరణ్కాలనీలో నివాసం ఉంటూ ర్యాపిడో బైక్ రైడ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 6న విజయ్‌కుమార్ హెచ్ఎంటీ హిల్స్ లోని కల్లు కంపౌడ్లో కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ప్ర సన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.