Gold ATM | హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం.. ఎక్కడుందో తెలుసా?
నగరంలో మరో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎంను శుక్రవారం అమీర్‌పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించారు.
Gold ATM | అమీర్‌పేట, డిసెంబర్ 29: నగరంలో మరో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎంను శుక్రవారం అమీర్‌పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించారు. గతేడాది డిసెంబర్లో బేగంపేటలో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించామని, తాజా ఏటీఎం మరిన్ని సదుపాయాలతో కూడిన వర్షన్-2 అని గోల్డ్ సిక్కా చైర్మన్ అంబిక బర్మన్, సీఈవో సయ్యద్ తారుచ్ తెలిపారు.
గతంలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి నాణేలను డ్రా చేసుకునే అవకాశం ఉండేదని, ఈ వర్షన్-2లో యూపీఐ విధానంలో క్యూర్ కోడ్ స్కాన్ ద్వారా కూడా నగదు చెల్లించి బంగారు, వెండి నాణేలను పొందవచ్చన్నారు. 99.99% నాణ్యత గ్యారెంటీ తెలిపే పత్రాలతో సహా 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారం, వెండి 10, 20, 50, 100 గ్రాముల నాణేలను డ్రా చేసుకునే వీలుందని, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయన్నారు. దేశ, విదేశాల్లో 2 నుంచి 3 వేల గోల్డ్ ఏటీఎంలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

