హైదరాబాద్ : నగరంలోని మరో ప్రాంతంలో అగ్ని ప్రమాదం ( Fire Accident ) చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహబూబ్ కాలనీ ( Mahabub Colony ) లో ఉన్న మెయిన్ ఇంటీరియర్ ఫోమ్ అండ్ ఫర్నిచర్ గోదాంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న టప్పాచబుత్రా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా గోదాంలోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.