సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ ) : నాణ్యమైన వైద్య సేవలను పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ప్రతి 5వేల నుంచి 10వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని నిర్ణయించి గ్రేటర్ వ్యాప్తంగా 350చోట్ల బస్తీ దవాఖానల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 226చోట్ల బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకురాగా త్వరలోనే మరో 27 చోట్ల అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.