సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : పక్షులు, జంతువులు గాయపడితే తమకు సమాచారం అందించాలని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టూ ఎనిమాల్స్(జీహెచ్ఎస్పీసీఏ)పిలుపునిచ్చింది. ‘మీరు వెళ్లేదారిలో మూగజీవాలు ఆపదలో ఉన్నట్లు కనిపించాయా? వెంటనే మా సంస్థకు ఫోన్ చేయండి మా ప్రతినిధులు వచ్చి రక్షిస్తారు.’
అంటూ అభయమిస్తున్నారు. వాటికి చికిత్స అందించి అవి గూడు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాంసం అమ్మకాల కోసం ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి జంతువులను అక్రమంగా తరలిస్తుంటారని.. అటవీ అధికారుల సాయంతో అనేక మూగజీవాలను కాపాడామని సంస్థ ప్రతినిధి సౌధర్మ్ తెలిపారు.
8886743881, 8555955202, 9394578568