అంబర్‌పేట/కవాడిగూడ, జనవరి 23 : కంటి వెలుగు ఒక మహా అద్భుతమైన పథకమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. భోలక్‌పూర్ డివిజన్లోని తాళ్లబస్తీ కాలనీలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి, బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని రామకృష్ణనగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్గౌడ్తో కలిసి సోమవారం మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా తాళ్లబస్తీ కాలనీలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంటి శిబిరాల్లో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కండ్లద్దాలు పంపిణి చేస్తామని అన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొన ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టారని చెప్పారు. జూన్ 30 వరకు అన్ని కాలనీలు, బస్తీలలోని ప్రజలు ఈ కార్య్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కేంద్రాలను ఒకచోట కాకుండా ప్రజల అవసరాలను బట్టి కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలలో కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్య్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, డీసీ వేణుగోపాల్, డీపీవో రజితారెడ్డి, తహశీల్దార్ లలిత, మెడికల్ ఆఫీసర్ డా.కాలేరు దీప్తిపటేల్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, అఫ్రోజ్పటేల్, శ్రీరాములుముదిరాజ్, రమేష్‌నాయక్, శివాజీయాదవ్, కనివేట నర్సింగ్‌రావు, నరహరి, బొట్టు శ్రీను, ఇ.ఎస్.ధనుంజయ, నవీన్‌యాదవ్, కోట్ల సంతోష్, పంజాల చంద్రశేఖర్‌గౌడ్, లక్ష్మణ్, మల్లేశ్‌యాదవ్, వల్లాల శ్యామ్ యాదవ్, వై. శ్రీనివాస్ రావు, నాయకులు బింగి నవీన్ కుమార్, రహీం, ఆర్. శ్రీనివాస్, మధు, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాకు కండ్లు మబ్బుమబ్బుగానే కనిపించేవి. కంటి వెలుగు శిబిరానికి పోయి పరీక్షలు చేయించుకున్నా. వైద్య సిబ్బంది కండ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. గతంలో ఎవరూ ఇలాంటి పనులు చేయలే. పేదల కోసం సీఎం కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది.
– సంగయ్య, గుడిమల్కాపూర్ సెంటర్
నాకు ఎన్నో ఏండ్లుగా కండ్ల నుంచి నీరు కారుతుండే. రెండుమూడు సార్లు ప్రైవేట్‌లో చూయించుకున్నా. అక్కడ అద్దాలు తీసుకోవాలని చెప్పారు. కొన్ని రోజులు చూసి ఆపరేషన్ చేస్తామన్నారు. పైసలు లేక అప్పుడు అద్దాలు తీసుకోలేదు. ఇప్పుడు మా ఇంటి దగ్గరే శిబిరం పెట్టి పరీక్షలు చేస్తున్నారని మా వదిన చెప్పింది. వెంటనే పోయి పరీక్షలు చేయించుకున్నా. మందులు ఇస్తే వేసుకొని, అద్దాలు పెట్టుకున్నా. చూపు బాగానే కనిపిస్తున్నది. నాకు చూపు ప్రసాదించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
ఆనందంగా ఉంది..కంటి సమస్యలున్నా ఆర్థిక భారంతో పరీక్షలు చేయించుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు.నాకు గతంలో చూపు సమస్య ఉండే. ప్రైవేట్ వైద్యశాలలో పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకున్నా. అయినా ఇబ్బంది తగ్గలేదు. ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నదని తెలుసుకొని ఇక్కడికి వచ్చా. ఉచితంగానే పరీక్షలు చేసి మందులు, కండ్లద్దాలు ఇవ్వడం ఆనందంగా ఉంది.
– చంద్రమౌళి, సహారాస్టేట్స్‌కాలనీ