హైదరాబాద్ : మాతా, శిశు సంరక్షణ కోసం పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను(Anganwadi centers) బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు. సోమవారం బన్సీలాల్‌పేట్ డివిజన్లో న్యూ బోయిగూడ గొల్ల కొమరయ్య కాలనీలో నిర్మించిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీల సేవలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర రావు, సీడీపీఓ సునంద, సూపర్వైజర్ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీఆర్పీఎస్ నూతన సంవత్సర డైరీని అధ్యక్షుడు సుదర్శన్‌బాబు మంత్రి ప్రభాకర్‌కు అందజేశారు.