మెహిదీపట్నం జనవరి 29: ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. లబ్ధిదారులకు మంజూరైన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ నసీరుద్దీన్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలకు అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, బద్రుద్దీన్, సమద్ వార్సి, మజహర్, తదితరులు పాల్గొన్నారు.
మెహిదీపట్నం జనవరి 29: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ పేర్కొన్నారు. శనివారం జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్వాన్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీజీఎం ఆనంద్నాయక్, డీజీఎం జవహర్అలీ, మేనేజర్లు, ఎంఐఎం నాయకులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, తదితరులు పాల్గొన్నారు.