ఒక్కఛాన్స్.. కోసం
సినిమాల్లో కథా రచయితగా అవకాశం కోసం సుమారు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ.. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కీర్తి సాగర్ వ్యవహారంపై ఫిలింనగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
- సినిమాలపై మక్కువతో.. పదెకరాలు అమ్మేశాడు
- ఆకర్షణ కోసం అసలు పేరు మార్చుకున్నాడు..
- కథా రచయిత మృతి వ్యవహారంలో కొనసాగుతున్న దర్యాప్తు
బంజారాహిల్స్, జూన్ 18: సినిమాల్లో కథా రచయితగా అవకాశం కోసం సుమారు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ.. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కీర్తి సాగర్ వ్యవహారంపై ఫిలింనగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. షేక్‌పేట సమీపంలోని ద్వారకానగర్‌లో శనివారం తెల్లవారుజామున తన గదిలో అనుమానాస్పద స్థితిలో కథా రచయిత కీర్తి సాగర్ (50) మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు ఫిలింనగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకురాలేదు. కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడే కీర్తి సాగర్‌గా మారాడు..
నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని కరివెన గ్రామానికి చెందిన పాలాది వెంకట సుబ్బయ్య సినీ పరిశ్రమపై ఇష్టంతో సుమారు 30ఏళ్ల క్రితమే చెన్నై వెళ్లినట్లు తేలింది. సినిమాల్లో కథలు రాయాలంటే ఆకర్షణీయమైన పేరు ఉండాలని సినీ పరిశ్రమలోని కొంతమంది స్నేహితులు చెప్పడంతో తన పేరును కీర్తి సాగర్‌గా మార్చుకున్నాడు. అక్కడ సుమారు 20 ఏళ్ల పాటు ఉండి.. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కథా రచయితగా అవకాశాల కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. అవకాశాలు రాకపోవడంతోపాటు అప్పులు పెరగడంతో సొంతూరిలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని సైతం అమ్మేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించి విఫలం కావడంతో పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి సాగర్.. పలు సినిమా షూటింగుల వద్దకు వెళ్లి తనవద్ద కథలు ఉన్నాయని, హీరోలను కలిపిస్తే కథలు వినిపిస్తానని బతిమాలేవాడని తెలిసింది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం చెప్పాలని ఉంది అనే సినిమాకు కో డైరెక్టర్‌గా పనిచేశాడని, దాంతో త్వరలోనే తనకు మంచిరోజులు రానున్నాయంటూ చెప్పాడని ఇంటి యజమాని తెలిపాడు. సొంతూరిలో ఒక సోదరుడు ఉన్నాడని, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటిదాకా మృతదేహాన్ని గురించి వాకబు చేయలేదని పోలీసులు తెలిపారు. సినిమాపిచ్చితో భూమిని అమ్మేయడంతో ఇతర కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవడం మానేశారని తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

