పీర్జాదిగూడ, మే13: బీఆర్ఎస్ దేశంలోనే బలమైన శక్తిగా అవతరించబోతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ నెల 16న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ పళని కన్వెన్షన్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఎస్వీఎం గ్రాండ్లో కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం కార్యాచరణ, నిర్వహణ పై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ ఉదయం 9గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, పార్టీ ప్రతినిధులు, మహిళానాయకురాళ్లు, శ్రేణులు పాల్గొన్నారు.
ఘట్కేసర్, మే 13 : పోచారం మున్సిపాలిటీ పరిధి…అన్నోజిగూడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీకంఠమేశ్వర స్వామి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అలాగే శనివారం రాత్రి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి,వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు, పోచారం బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ బి.వెంకటేశ్ గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు వెంకటస్వామి గౌడ్, దర్శన్ గౌడ్, ఎ.శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింహులుగౌడ్, బి.శంకర్ గౌడ్, విజయ్ గౌడ్, లక్ష్మయ్య గౌడ్ పాల్గొన్నారు.