సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో శనివారం స్టార్ హాస్పిటల్ అంబులెన్స్‌ను ఉచితంగా అందించింది. తెల్లాపూర్‌కు చెందినవారు అత్యవసర పరిస్థితుల్లో 24/7 అంబులెన్స్ సేవలు వినియోగించుకోవడానికి వీలుగా అత్యాధునిక వసతులు కల్పించి అందించినట్లు స్టార్ హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, ప్రాణాంతక పరిస్థితులను సమర్థవంతంగా పరిష్కరించడానికి అంబులెన్స్‌లో అధునాతన కార్డియాక్ లైప్ సపోర్ట్ అమర్చారని తెలిపారు. కాగా, స్టార్ గ్రూప్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మెదక్కర్, స్టార్ గ్రూప్ హాస్పిటల్స్ ఎమర్జెనీ కేర్ గ్రూప్ హెడ్ డాక్టర్ కట్టా రమణ ఈశ్వర్ జెండా ఊపి వాహన సేవలను ప్రారంభించారు. సేవలకు 85368 53853 నంబర్‌కు కాల్ చేయొచ్చని తెలిపారు.