కాచిగూడ,నవంబర్ 19: బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అంబర్‌పేట అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గత ఐదేండ్లల్లో అంబర్‌పేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలిపామని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. ఆదివారం కాచిగూడలోని డాక్టర్ భూమన్నలైన్, బర్కత్‌పుర, గోల్నాక డివిజన్లోని కృష్ణానగర్, శాస్త్రీనగర్, సుందర్‌నగర్ ఏ,బీ,సీ, ప్రాంతాల్లో మందలాది కార్యకర్తలతో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ అంబర్‌పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా..రెండోసారి అవకాశం ఇవ్వండి.. మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయల కల్పించామని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాచిగూడలో జైన్, మర్వాడీ ప్రజలు ప్రచారంలో పాల్గొనడం పార్టీకి కొం డంత బలం చేకూరిందన్నారు. కార్యక్రమంలో గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, పార్టీ కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎర్రభీష్మాదేవ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలం, సాయి, శ్రీకాంత్, యోగేశ్, శేషు, కె.సదానంద్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, శాంతి, ప్రతిభ, బి.కృష్ణాగౌడ్, ఎల్.రమేశ్, మహేశ్‌కుమార్, అశోక్, సతీశ్, శ్రీకాంత్‌యాదవ్, మహేందర్, క్రాంతి, బబ్లూ, అంటోని, అబ్దుల్ కబీర్, మహ్మద్, ఆర్కే బాబు, రెడపాక రాము, నర్సింగ్బాబు, శ్రీకాంత్, కిశోర్, బబ్బి, స్థానికులు పాల్గొన్నారు.
అంబర్‌పేట : బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదివారం ఉస్మానియా యూనివర్శిటీలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి మద్దతు కోరారు. తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. శివాలయంలో పూజలు చేసి రోజూ నడక సాగించే వారిని కలిశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓయూ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నవీన్, చారి తదితరులు పాల్గొన్నారు.