సికింద్రాబాద్ : పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సీతాఫల్మండి డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సంతోష్ కుమార్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు.
సంతోష్ మరణంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమాచారం తెలుసుకున్న పద్మారావు గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యా లయాన్ని సంప్రదించి రూ.ఐదు లక్షల మేరకు నిధులను మంజూరు చేయించారు.
ఈ మేరకు శనివారం రూ. 5లక్షల చెక్కును డివిజన్లోని షాబాజ్ గూడాలో గల దివంగత సంతోష్ కుమార్ నివాసంలో అయన సతీమణి అనితకు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అందించారు.