సిటీబ్యూరో, మార్చి 28 ( నమస్తే తెలంగాణ ) : మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారత్ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత చేపట్టిన పోరాటానికి ఎన్ఆర్ఐ మహిళలుగా తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆడబిడ్డలకు రోల్ మోడల్‌గా కవిత ఆదర్శమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను, ప్రాముఖ్యతను చాటిచెప్పిన ఘనత కవితకే దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కవిత ఆధ్వర్యంలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.