జాతీయ జిమ్నాస్టిక్స్ చాంప్.. అలహాబాద్ ఖేల్గావ్ పబ్లిక్ స్కూల్
సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ అంతర్ పాఠశాలల చాంపియన్‌షిప్ టైటిల్‌ను అలహాబాద్ ఖేల్గావ్ పబ్లిక్ స్కూల్ సొంతం చేసుకుంది. నోయిడా శివ నాడార్ స్కూల్, ఆగ్రా గ్రాయత్రి పబ్లిక్ స్కూల్ జట్లు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి
హైదరాబాద్, ఆట ప్రతినిధి, డిసెంబర్ 25 : సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ అంతర్ పాఠశాలల చాంపియన్‌షిప్ టైటిల్‌ను అలహాబాద్ ఖేల్గావ్ పబ్లిక్ స్కూల్ సొంతం చేసుకుంది. నోయిడా శివ నాడార్ స్కూల్, ఆగ్రా గ్రాయత్రి పబ్లిక్ స్కూల్ జట్లు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఆదివారం గచ్చిబౌలిలోని ది గౌడియం స్కూల్లో సీబీఎస్ఈ జిమ్నాస్టిక్స్ జాతీయ చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొని బహుమతులు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ కోశాధికారి, తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.మహేశ్వర్ సాగర్ మాట్లాడుతూ.. కొత్త కోచ్‌ల నియామకం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌పాల్ రెడ్డి, తెలంగాణ సంఘం ప్రతినిధులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ప్రభు పటేల్, రామకృష్ణా రెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

