కాచిగూడ, సెప్టెంబర్ 7: తెలంగాణ జైలు, సవరణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైల్ డ్యూటీ మీట్-2025ను ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని ఆర్పీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జైళ్లు, సవరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రాతెలిపారు. 21 రాష్ర్టాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1300 మందికి పైగా జైలు సిబ్బంది పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు. 9న ఉదయం 9.30 గంటలకు హిమాయత్‌సాగర్‌లోని పోలీస్ అకాడమీలో ముఖ్యఅతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ డాక్టర్ జితేందర్ హాజరై డ్యూటీమీట్-2025ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.