జీవవైవిధ్యమా? విధ్వంసమా?
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ... ఈ రెండు వ్యవసాయానికి రెండు కండ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత సాగు కొత్త పుంతలు తొక్కడం కీలక భూమిక పోషించాయి. 2014 నుంచి దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించింది.
- వ్యవసాయ వర్సిటీ భూములను లాక్కోవద్దు
- జీవో 55కు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు
వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 23 : ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ… ఈ రెండు వ్యవసాయానికి రెండు కండ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత సాగు కొత్త పుంతలు తొక్కడం కీలక భూమిక పోషించాయి. 2014 నుంచి దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించింది.
వర్సిటీలో గల 400 రకాల వృక్షజాతులు, 80 రకాల పక్షులు, 350 అరుదైన జాతులతో జీవ వైవిధ్యం విరాజిల్లుతున్నది. దక్కన్ పీఠభూమిలో ఉన్న వైవిద్యమైన వాతావరణంలో ఉన్న బయోడైవర్సిటీ పార్క్‌ను ధ్వంసం చేసేలా, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఉన్న ఈ రెండు యూనివర్సిటీల పరిధిలోని దాదాపు 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకొచ్చిన జీవో నెం.55పై విద్యార్థిలోకం భగ్గుమన్నది. యూనివర్సిటీ భూములు కాపాడేందుకు రోజుకో తీరున నిరసన తెలుపుతున్నారు. సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్, సేవ్ ఫార్మర్స్, స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్ అంటూ సంక్రాంతి సెలవులనూ లెక్కచేయకుండా విద్యార్థులు చేపట్టిన ధర్నాలకు అఖిల పక్ష నాయకులు మద్దతు ప్రకటించారు.

రాజేంద్రనగర్‌తో పాటు నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, సిరిసిల్ల, వరంగల్ ,ఆదిలాబాద్, వర్సిటీ బ్రాంచ్‌లలోనూ రోజూ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వర్సిటీ కళాశాల విద్యార్ధి సంఘాల నాయకులు రాజ్ కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్,దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్‌రెడ్డి, వినయ్ రెడ్డి, శంకర్ నాయక్, రాకేష్, ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

