సుల్తాన్‌బజార్,జనవరి 27: నగల వ్యాపారి దృష్టి మళ్లించి రూ.18 లక్షల విలువజేసే డైమండ్‌ను తస్కరించిన నిందితుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్ దత్, సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్, డీఐ సతీశ్ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకకు చెందిన మహ్మద్ రయిలా ఆన్లైన్లో గుజరాత్‌కు చెందిన ఓ నగల వ్యాపారిని మాటలతో నమ్మించి, తనకు డైమండ్ కావాలంటూ నగరానికి రప్పించాడు. దీంతో గుజరాత్‌కు చెందిన డైమండ్ వ్యాపారి వివేక్ జతిన్ జవేరి హైదరాబాద్‌కు వచ్చాడు.
కర్ణాటకకు చెందిన మహ్మద్ రయిలాతో సదరు వ్యాపారి అఫ్జల్‌గంజ్‌లోని అంబికా లాడ్జిలో భేటీ అయ్యారు. మహ్మద్ రుయిలా తన పథకం ప్రకారం.. వ్యాపారి వివేక్‌ను డైమండ్ చూపించమని కోరాడు. వ్యాపారి డైమండ్ చూపించాడు. మాటలతో వ్యాపారి దృష్టి మళ్లించిన నిందితుడు రయిలా రూ.18 లక్షల విలువజేసే డైమండ్‌ను దాచేశాడు. ఆ డైమండ్ స్థానంలో నకిలీ డైమండ్‌ను ఉంచాడు. వీరిద్దరి మధ్య వ్యాపారం కుదరలేదు. నిందితుడి చేతిలో ఉన్న డైమండ్‌ను తిరిగి వ్యాపారి తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత వ్యాపారి వివేక్ డైమండ్‌ను పరిశీలించగా అది నకిలీదని తేలింది.
దీంతో ఈ నెల 26న అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటకకు వెళ్లింది. నిందితుడిని అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అతడి వద్దనున్న రూ. 18 లక్షల విలువ చేసే డైమండ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, 4 సెల్ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో నిందితులని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సొత్తును రికవరీ చేసేందుకు కృషి చేసిన సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, డీఐ సతీశ్, క్రైం సిబ్బందిని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.