జవహర్‌నగర్, డిసెంబర్ 1: కలుషిత అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న ఓ ఇంటిపై మల్కాజిగిరి ఎస్వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జవహర్‌నగర పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది.
ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్‌నగర్‌లో రహస్యంగా కలుషిత పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిపై దాడిచేశారు. యజమాని మహ్మద్ అతావుల్లాను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సుమారు 1000కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.