సైదాబాద్, జనవరి 21: కేంద్ర ట్రైబల్, యువజ న వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ ప్రొగాం-2025ను నిర్వహిస్తున్నట్లు నె హ్రూ యువ కేంద్ర సంఘటన్ హైదరాబాద్ జిల్లా యువజన అధికారి కుష్బూ గుప్తా తెలిపారు. సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలోని తెలంగాణ నెహ్రూ యు వ కేంద్ర సంఘటన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆదివాసీ యువతలో జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం యువతకు వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ యుజనోత్సవాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఝార్ఖండ్ రాష్ర్టాలకు చెందిన 200 మంది యువకులు పాల్గొంటారని, వీరి పాటు వివిధ రక్షణ దళాలకు చెందిన 20 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారని ఆమె తెలిపారు. ఆదివాసీ సమ్మేళనంలో యువత పరస్పరం తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తపరుస్తారన్నారు. అదే విధం గా స్వయం ఉపాధి అవకాశాలల్లో శిక్షణ ఇవ్వటం, నగరంలోని వారసత్వ కట్టడాలను సందర్శిస్తారని తెలిపారు. అనంతరం, యూత్ ఎక్స్ఛేంజ్ ప్రొగాం పోస్టర్ను ఆమె రాష్ట్ర అదనపు డైరెక్టర్ గంట రాజేశ్, కార్యాలయ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.