సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగానికి అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న నళిని పద్మావతిపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో మరో అదనపు కమిషనర్ అయిన కె. వేణుగోపాల్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.