Health Center | అడ్డగుట్ట, జూన్ 20 : అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రాన్ని తుకారం గేట్ బోయబస్తీలోని కమ్యూనిటీ హాల్‌కు మార్చుతున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రం స్థలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అడ్డగుట్ట ప్రజలకు వైద్య సేవలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా ఆరోగ్య కేంద్రాన్ని బోయబస్తీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. కావున ప్రజలు గమనించి సహకరించాలని ఆమె కోరారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేంతవరకు బోయబస్తీ కమ్యూనిటీ హాల్లోనే వైద్య సేవలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.