‘మెరుపులాగా వాలే చిన్ని అందమా.. మరపు రానే రాని మేని రూపమా’ అంటూ మహానుభావుడు చిత్రంలోని చరణాలను మరోసారి పాడుకునేలా చేసింది ముద్దుగుమ్మ మెహ్రీన్. గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఈ సొగసరి.. సంప్రదాయ సింగారంతో ఇలా ఫొటోకు పోజిచ్చి.. కుర్రాళ్ల కంటికి నిద్రకరువు చేసింది.
మాదాపూర్, నవంబర్ 10: మానేపల్లి జ్యువెలర్స్ 5 వ షో రూంను గురువారం చందానగర్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి, బ్రాండ్ అంబాసిడర్ మెహ్రీన్ కౌర్ హాజరై మానేపల్లి సీఎండీ మానేపల్లి రామారావు, మానేపల్లి జ్యువెలర్స్ డైరెక్టర్స్ మానేపల్లి మురళీ కృష్ణ, గోపికృష్ణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.