Karate Sports | కొండాపూర్ : చందానగర్ పీజేఆర్ స్టేడియం కుంగ్‌ఫూ, కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీల్లో విద్యార్థులు తమదైన శైలిలో సత్తాచాటారు. డ్రాగన్ ఫైటర్స్, మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ 4వ ఇంటర్నేషనల్ ఓపెన్ టూ ఆల్ స్టయిల్ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్ షిప్లో సత్తా చాటిన వారిని బుధవారం చందనగర్ పీజేఆర్ స్టేడియం కోచ్ బుధవారం విద్యార్థులను అభినందించి సత్కరించారు. డీ విశ, చరణ్, కే బాలాదిత్యా గోల్డ్ మెడల్‌ను గెలువగా.. వీఎన్ అఖిల్, ఎం నిహారిక, బీ అర్జున్ సిల్వర్ మెడల్స్ సాధించారు.
ఆ తర్వాత విశాఖపట్నంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ పోర్ట్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రెండో అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పీజేఆర్ స్టేడియానికి చెందిన కోచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాంపియన్షిప్ పోటీల్లో విద్యార్థులు పాల్గొని, సిల్వర్ పతకాలు సాధించిన వారికి ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. నందకిశోర్, కేగోవర్ధన్, కే ఉదయ్ కుమార్, వీ ప్రభుదాస్, వీ యేసుబాబు, వైభవ్‌లను కోచ్ అభినందించారు.