Hyderabad | సిటీబ్యూరో/బంజారాహిల్స్, జనవరి 29: బంజారాహిల్స్ రోడ్ నం.1లోని పెన్షన్ ఆఫీస్ జంక్షన్‌తో పాటు సమీపంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు గల అవకాశాలను జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. దీంతో పాటు రోడ్ల విస్తరణ చేపట్టడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా విభాగాల అధికారులు సోమవారం జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. మాసబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.12 దాకా రోడ్డు విస్తరణకు గల అవకాశాలను పరిశీలించారు.
మాసబ్ ట్యాంక్ వైపు నుంచే వాహనాలు నె మ్మదిగా ముందుకు సాగడానికి గల కారణాలను గమనించిన అధికారులు బంజారా ఫంక్షన్ హాల్ పక్కన నాలా వైపు నుంచి లింక్ రోడ్డును విస్తరించడం ద్వారా ప్రయోజనం ఉంటుందా? అనే అంశాన్ని అధ్యయనం చే యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు బల్కాపూర్ నాలా మీదు గా ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని జీహెచ్ఎం సీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. ట్రా ఫిక్ రద్దీ అధికంగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నం.12లో రోడ్డు విస్తరణను చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యటనలో ట్రాఫిక్ ఇన్చార్జి అదనపు కమిషనర్ రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిటీ ప్లానింగ్ విభాగం అధికారి రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.