శేరిలింగంపల్లి, జూన్ 21 : రాత్రివేళ్లల్లో ఐటీ రహదారులపై భయంకరమైన శబ్ధాలతో బైక్‌రేసింగ్‌లకు(Bike racing) పాల్పడి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ ఏసీపీ సీహెచ్.శ్రీకాంత్ హెచ్చరించారు. శుక్రవారం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఇన్స్పెక్టర్ వెంకన్నతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రహదారులపై బైక్ రేసింగులకు పాల్పడడం, మితిమీరిన వేగం, భారీ శబ్ధకాలుష్యంతో విన్యాసాలు చేస్తే సహించేది లేదన్నారు. సదరు వాహనదారులపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొందరు యువకులు గ్రూపులుగా ఏర్పడి నిత్యం రేసింగులకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బందులు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాలెడ్జిసిటీ ఐటీ కారిడార్ టీ-హాబ్ ప్రాంతంలోని రహదారులపై భయంకరమైన స్టంట్స్‌తో విపరీతమైన శబ్ధకాలుష్యంతో కొందరు యువకులు బైక్రేసింగులకు పాల్పడుతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందడంతో స్పెసల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఈ సంఘటనలో 89 మంది బైక్‌రేసర్లను గుర్తించి వారిని అదుసులోకి తీసుకొని 89 బైక్‌లు, రెండు కార్లు సీజ్ చేశామని వివరాను వెల్లడించారు. ముఖ్యంగా మైనర్లకు బైక్ విన్యాసాలు చేస్తూ పట్టుబడితే వారితో పాటు తల్లిదండ్రులపై సైతం చట్టరీత్యా క్రిమినల్ కేసులు( Criminal cases) పెడతామన్నారు.