మృతదేహాన్ని తీసుకువచ్చి.. గాంధీలో వదిలేసి..!
గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన నిందితుల గురించి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
బన్సీలాల్‌పేట్/అడ్డగుట్ట, మే 14: గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన నిందితుల గురించి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని క్యాజువాలిటీకి స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు. ఓపీ చిట్టీ తీసుకొని వస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి విధి నిర్వహణలో ఉన్న క్యాజువాలిటీ వైద్యులు పరిశీలించగా స్ట్రేచర్‌పై ఉన్న వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడి ముఖం, చేతులు, తలపై గాయాలున్నాయి. మృతుడికి 30 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉంటుందని, కుడి చేతిపై హిందీలో ‘జితేందర్-ఖుషి’ అని పచ్చబొట్టు ఉండటంతో అతడు బెంగాల్ లేదా ఒడిశాకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు గాంధీ దవాఖాన నుంచి గచ్చిబౌలి వరకు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మృతుడు అదే పరిసరాలలో ఏదైన నిర్మాణంలో ఉన్న భవనంలో కార్మికుడిగా పనిచేస్తూ ఉండవచ్చని, తోటి కూలీలతో ఏదైన గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నది. ఆదివారం చిలకలగూడ పోలీసులు సీసీటీవీలో రికార్డు అయిన మృతదేహాన్ని వెంట తీసుకువచ్చిన సమయంలో అతడి వెంటఉన్న వ్యక్తి ఫొటోను మీడియాకు విడుదల చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

