హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు( Bank accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్(arrested) చేశారు. సైబర్ నేరగాళ్లు గూగుల్ మ్యాప్‌నకు రేటింగ్ పేరుతో టాస్క్‌లు ఇచ్చి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ముందు లాభాలు చూపి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాక ముఖం చాటేస్తారు.
బాధితుల నుంచి కాజేసిన సొమ్మును పలు బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తున్నారు. కాగా, సైబర్ నేరగాళ్లకు ఆ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న బేగంపేటకు చెందిన నిందితుడు వెంకటేష్, మల్కాజిగిరికి చెందిన విజయ్‌ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రూ.3 కోట్ల మేర నిందితులు సొమ్మును కాజేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.