శంషాబాద్ రూరల్, ఆగస్టు 2 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కేసులో నిందితురాలిని శనివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ కొంతమంది ఈ మొయిల్స్ పెడుతున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల ఎయిర్‌పోర్టులో బాంబ్ ఉందంటూ ఒకరు మెయిల్ పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. మెయిల్ పెట్టింది కర్ణాటక రాష్ర్టానికి చెందిన రెనే జోషిత (39)గా గుర్తించారు. ఆమె రోబోటెక్ ఇంజినీర్‌గా పని చేస్తున్నది. అయితే… ఆమెకు, ఆమె ప్రేమికుడికి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. కోపంతో అతడి ఈ మొయిల్ ద్వారా పంపించినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె శంషాబాద్ఎయిర్పోర్టుకు రెండుసార్లు బాంబు బెదిరింపుల కు పాల్పడిన్నట్లు వివరించారు.
ఆగస్టు 15 కోసం ముందస్తు చర్యలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం సీఐఎస్ఎఫ్, రక్ష, ఎయిర్‌పోర్టు పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తుగా వాహనాలను తనిఖీలు చేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్టు చుట్టూ భద్రతను పెంచినట్లు వివరించారు. ఆగస్టు 15 వేడుకలు ముగిసే వరకు మూడంచెల భద్రత ఉంటుందన్నారు.