Hyderabad | పబ్లిసిటీ కోసం హీరోయిన్‌పై తప్పుడు కామెంట్స్.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
బోగస్ సోషల్ మీడియా అకౌంట్‌ను ఏర్పాటు చేసుకుని సినీ ప్రముఖులను అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్,మార్చి 3: బోగస్ సోషల్ మీడియా అకౌంట్‌ను ఏర్పాటు చేసుకుని సినీ ప్రముఖులను అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన రుషిత్(24) అనే యువకుడు సినిమాలు, టీవీ సీరియల్స్‌లో చిన్నాచితకా వేషాలు వేస్తుంటాడు. తన సోషల్ మీడియా వ్యూస్ పెంచుకుని తద్వారా పబ్లిసిటీ సంపాధించుకోవాలనే ఉద్దేశంతో రీల్ మాయ అనే పేరుతో బోగస్ సోషల్‌మీడియా వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. సినీ హీరోయిన్ల అకౌంట్స్‌ను ఫాలో అవుతూ నోటికి వచ్చిన బూతు వ్యాఖ్యలను కామెంట్ రూపంలో చేస్తున్నాడు.
ఈ మేరకు ఇటీవల టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ను, దర్శకుడిని ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. ఈ మేరకు బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్‌మీడియా అకౌంట్ ఆధారంగా నిందితుడు రుషిత్ను గుర్తించిన పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించగా పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నట్లు తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేయించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

