శామీర్ పేట, ఏప్రిల్ 16: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లిలో గురువారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర విసృ్తత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవో 252లో అవసరమైన మేరకు సవరణలు చేసి అమలు చేస్తామని, జర్నలిజంతో సంబంధంలేనివారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండా యూనియన్ బాధ్యులు జాగ్రత్త వహించాలని సూచించారు.
నకిలీ జర్నలిస్టులను గుర్తించి కార్డులు అందకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టుల విషయంలో సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని పేరొన్నారు. డెస్ సబ్ ఎడిటర్లకు కూడా అక్రెడిటేషన్ కార్డులు అందుతాయని స్పష్టం చేశారు. సమావేశంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఏ మజీద్, జాతీయ ఉపాధ్యక్షుడునరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు శేఖర్, సత్యనారాయణ, అజిత, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాములు, కోశాధికారి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైసల్ అహ్మద్, సంపత్ కుమార్ గౌడ్, మధు, రాష్ట్ర కార్యదర్శులు యాదగిరి, శ్రీకాంత్ రెడ్డి, మధు గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, కార్యదర్శి వెంకట్రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల మరణించిన 16 మంది జర్నలిస్టులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిద్ధారెడ్డిని ఘనంగా సన్మానించారు.