కుత్బుల్లాపూర్,ఆగస్టు21ః జిరాక్స్ కోసం తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన శనివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిజామాబాద్ జిల్లాకు చెందిన సింధూజ(23) తన తల్లిదండ్రులతో కలిసి గత కొన్నేళ్ల కిందట నగర శివారు బహదూర్పల్లికి బతుకుదెరువు కోసం వచ్చారు. సింధూజ తండ్రి గత కొంతకాలం కిందట మృతి చెందగా తనతల్లితో పాటు సోదరుడు సాయిలతో కలిసి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంది. శనివారం రాత్రి జిరాక్స్ కోసమని ద్విచక్రవాహనంపై దూలపల్లికి వచ్చారు..తిరిగి బహదూర్పల్లిలోని తన ఇంటికి వెళ్తుండగా మార్గమద్యలోని దూలపల్లి ఫారెస్టు అకాడమీ సమీపంలో వెనకాల నుంచి కేఎంబీటీ ప్రైవేట్ బస్సు అతివేగంతో వచ్చి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం వెనకాల కూర్చున సింధూజ ఒక్కసారిగా రోడ్డుపై పడటంతో ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తన సోదరుడు సాయి రోడ్డుకు ఇరుపక్కల పడటంతో తీవ్రగాయాలపాలయ్యాడు.