హైదరాబాద్ : హెచ్ఎండీఏ(HMDA )ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ(Shiva Balakrishna) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు(ACB Rides) చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారనే ఆరోపణలపై నగరంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ఇల్లు, బంధువులు కార్యాలయాల్లో సైతం సోదాలు చేపట్టారు. పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.