Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. ప్రైవేటు టీచర్‌పై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే ఆమెపై నాగరాజు అనే యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
యువతి మెడ, వీపుపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. టీచర్‌పై దాడి చేసిన అనంతరం నాగరాజు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కత్తితో కోసుకుంటున్న నాగరాజును అడ్డుకున్నారు. బాధితురాలికి, నిందితుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాగరాజు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.