ఎల్బీనగర్, ఏప్రిల్ 20: పాత కక్షలతో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలి పిన కథనం ప్రకారం.. నాగోల్‌కు చెందిన పంగా మనోజ్( 24), తన స్నేహితుడు బందె ల వంశీ( 21) తో కలిసి శనివారం అర్ధ రాత్రి 1:50 గంటల సమయంలో నాగోల్ ఫ్లైఓవర్ యూటర్న్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ బండి వద్ద యాక్టివాపైన కూర్చొని టిఫిన్ చే స్తున్నారు.
అదే సమయంలో మనోజ్ స్నేహి తుడు జయపురి కాలనీకి చెందిన సంజయ్ , మహేశ్ , మరో స్నేహితుడు ముగ్గురు కలిసి బైక్‌పై వచ్చి సంజీవ్ తన వెంట తెచ్చుకున్న కత్తి తో మనోజ్‌ను కడుపులో కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు.
అడ్డుకోబోయిన స్నేహితుడు వంశీపై సంజయ్ కత్తితో దాడి చేయగా అతనికి గాయాలయ్యాయి. సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని యా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.