మేడ్చల్, జూన్ 2: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం ఈస్ట్ సింగ్భూమ్ జిల్లా దరిశోల్ గ్రామానికి చెందిన రిపూన్ దండాపత్(26) బతుకుదెరువు కోసం మేడ్చల్‌కు వచ్చి, కార్మికుడిగా పని చేస్తున్నాడు. మేడ్చల్ పట్టణంలోని గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.