శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 : ప్రియురాలికి వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వర్మ ప్రధాన్ (28) అపర్ణ కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతను గత కొంతకాలంగా ఒక యువతితో ప్రేమ వ్యవహారం(,Love affair) నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య కలహాలు రావడంతో సరిగ్గా మాట్లాడుకోవడం లేదని తెలిసింది.
గత రాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసిన వర్మ ప్రధాన్ తాను ఉంటున్న రూమ్ లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాసపిటల్కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే వర్మ ప్రధాన్ మృతికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.