హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఖైరాతాబాద్ గణపతి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
మహా గణపతి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్న ఓ గర్భిణి ప్రసవించింది. ఆమెను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.