కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6: కొంపల్లి మున్సిపాలిటీ పరిధి నూజివీడు సమీపంలో సుమారు 847 గజాల రోడ్డు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ప్లాట్‌గా చేసుకొని విక్రయించారు. ఈ ఉదం తం ఇటీవల నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో వెలుగు లోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో సర్వే నం. 199లో నాలుగెకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా ఎంఎస్ వీ3 ఇన్ఫ్రా బిల్డింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో హెచ్ఎండీఏ నుంచి 69 విల్లాలకు అనుమతులు పొందారన్నారు.
అదే సమయంలో విల్లాలకు సరైన రోడ్డు మార్గాన్ని చూపించేందుకు 2016లో 18.91 గుంటల స్థలాన్ని 40 ఫీట్ల రోడ్డుకు ప్రజల సౌకర్యార్థం అప్పటి గ్రామ పంచాయితీకి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారన్నారు. అనంతరం, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సంస్థ నిర్వాహకులు 2020 జూన్ లో మున్సిపాలిటీతో ఎలాంటి ప్రమేయం లేకుండానే మార్పులు చేసుకున్నారన్నారు.
యథేచ్ఛగా ప్రభుత్వానికి సం బంధించిన రోడ్డును మార్పులు చేసుకున్నారని, దీని పై గతంలోనే హెచ్ఎండీఏకు మున్సిపాలిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కాలక్రమేణ దూలపల్లి ప్రాంతానికి చెందిన బి.సత్యనారాయణ ప్రస్తుతం రోడ్డును మాయం చేసి ప్లాట్‌గా మార్చి అక్రమంగా కోట్ల రూపాయలకు విక్రయించారని కమిషనర్ శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, ఇటీవల దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొం పల్లి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరికి కోర్టులో శుక్రవారం అప్పీల్ చేసి ఆధారాలతో పాటు ఆయా పత్రాలను అందించి ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయస్థానంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బైరి శ్రీవిద్యా ప్రశాం త్ గౌడ్ ద్వారా ఫిర్యాదు చేశామని, కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వన రోడ్డు స్థలాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీం తో స్పందించిన కమిషనర్ సంబంధిత టౌన్ ప్లానిం గ్ అధికారులతో చర్చించి ఆక్రమణకు గురైన రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, కొంపల్లి అధ్యక్షులు కౌన్సిలర్ బైరి శ్రీవిద్య ప్రశాంత్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు సన్న శ్రీనివాస్ దవ్, సుధర్శన్రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.