ఖైరతాబాద్, డిసెంబర్ 23 : నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా పెట్ స్టార్ పేరుతో ఏర్పాటు చేసిన పెట్ కార్నివాల్ ఆకట్టుకున్నది. తెలంగాణ కేనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్నివాల్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 600 రకాల మేలి జాతి కుక్కలు, 350 రకాల పిల్లులు, పలు జాతుల పక్షులను ప్రదర్శనలో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శనివారం తెలంగాణలో కెనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పెట్ కార్నివాల్లో నల్లటి కళ్లద్దాలు ధరించి ఆకట్టుకున్న తెల్లపిల్లి