Old City | చాంద్రాయణగుట్ట, మార్చి 13 : హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో చిన్న వివాదం ప్రాణాలను బలి తీసుకుంది. యువకులు దాడి చేయడంతో 62 ఏళ్ల దుకాణదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన చిన్న సమస్యలపై పెరుగుతున్న హింసపై తీవ్రమైన ఆందోళనలకు దారి తీసింది.
పాతబస్తీకి చెందిన జకీర్ ఖాన్(62) హఫీజ్ బాబా నగర్‌లోని సి బ్లాక్‌లో కిరాణ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆయన దుకాణం ముందు కుర్చీలు వేయడంపై తలెత్తిన వివాదం పక్కనే ఉన్న పాన్ షాపు యజమానులతో వాగ్వాదానికి దారితీసింది. వాగ్వాదం మధ్యలో పాన్ షాపు యజమానులు జకీర్ ఖాన్‌పై దాడికి పాల్పడ్డారు. దాడి తరువాత, జాకీర్ ఖాన్ కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. అధికారులు సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న చిన్న వివాదాలకు అదుపు లేకుండా జరుగుతున్న ప్రమాదాలను ఎత్తిచూపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
ఓల్డ్ సిటీలో షాపు ముందు కూర్చోవద్దని అన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపిన యువకులు
కాంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని బాబా నగర్లో కిరాణా దుకాణం నడుపుతున్న జాకీర్ ఖాన్(62) షాపు ముందు నిన్న రాత్రి కుర్చీలు వేసి కస్టమర్లను కూర్చోబెట్టిన పక్కన ఉన్న పాన్ షాప్ యజమానులు
తన… pic.twitter.com/QmygBxlOTS
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025