కొండాపూర్, నవంబర్ 23 : వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే, ప్రపంచ నవజాత శిశువుల వారోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాలెడ్జ్ సిటీలోని టీ వర్క్స్ సమీపంలో 4వ ఎడిషన్ ప్రీమిథాన్ ది హోపన్ను నిర్వహించింది. నవజాత శిశువుల సంరక్షణను బలోపేతం చేయడం, ప్రతి అకాల శిశువు జీవితంలో పోరాడే అవకాశాన్ని పొందేలా చూసుకోవడంపై అవగాహన కల్పించే దిశగా రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ప్రీమిథాన్లో 2,500లకు పైగా ప్రజలు పాల్గొన్నారు. 3కే, 5కే, 10కే రన్ ద్వారా వచ్చే మొత్తాన్ని అకాల శిశువులు, నవజాత శిశువుల సంరక్షణ, చికిత్సలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
