హైదరాబాద్ : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి మోసం(Cheating) చేస్తున్న ముఠాను మేడిపల్లి (Medipalli) పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.51లక్షలు, 5 కిలోల నకిలీ బంగారం(Role gold) స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానస్పందగా తిరిగే వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.