MDMA | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 75 గ్రాముల ఎండీఎంఏ కలిగి ఉన్న ఓ వ్యక్తిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కలిగి ఉన్న వ్యక్తిని రజాక్గా పోలీసులు గుర్తించారు. ఇతను ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని నిర్ధారించారు.
రజాక్ ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు..? ఎక్కడ్నుంచి కొనుగోలు చేస్తున్నాడు..? ఎవరెవరికి విక్రయించాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.