జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలుకాకపోవటం తీవ్ర అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ విమర్శించారు. సోమవారం జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ వరర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 6 సంవత్సరాల క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచారని.. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కపైసా పెంచకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదురొంటున్నారన్నారు. తక్షణం వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)
కార్మిక చట్టాలు అమలు చేయాలి..
రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి కార్మికులు కనీస వేతనాలకు, కార్మిక చట్టాలకు సైతం దూరంగా ఉన్నారని నర్సింహ విమర్శించారు. కాంట్రాక్ట్ చట్టం ప్రకారం నాలుగు పండుగ సెలవులు, నాలుగు జాతీయ సెలవులు, 20 రోజుల పనికి ఒకరోజు వేతనంతో కూడిన ఆర్జిత సెలవు.. మొత్తం సంవత్సరానికి 23 సెలవులు అమలు చేయాల్సి ఉన్నా వాటిని కూడా అమలు చేయకపోవడం అన్యాయమని వారు పేరొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజానీకం సంఖ్య, బిల్డింగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకపోవడం వలన కార్మికులపై పని భారం పడుతున్నదని, చనిపోయిన కార్మికుల స్థానంలో కూడా వారి కుటుంబీకుల్ని తీసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు. మున్సిపల్ వరర్స్ యూనియన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ పీ వెంకటయ్య మాట్లాడుతూ.. ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎండల దృష్ట్యా పని గంటలను తగ్గించాలని, కరోనా సమయంలో నియమితులైన ఎంటమాలజీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలు, పీఎఫ్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ.30 లక్షల ఇన్సూరెన్స్‌కు కమిషనర్ హామీ
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సంవత్సరానికి 23 లీవులు ఇచ్చేందుకు, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ఎస్బీఐ ద్వారా రూ.30లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు, కార్మికుల జీతాలు పెంపుకై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హామీ ఇచ్చినట్లు ఏఐటీయూసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ వరర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, ఉప ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, కార్మికులు ఎల్ రవికుమార్, విశ్వప్రసాద్, సత్తార్, భూమేష్, సత్య, కొండల్, విక్రమ్విక్రమ్, పరశురాం, కళ్యాణ్, ధర్మపురి, స్వప్న, మహబూబా, సోమయ్య, సోమనాథ్, ఇంద్ర, శ్రీను, ఉపేందర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.